కరోనా లాక్‌డౌన్‌తో చిన్న పెద్ద సినిమా షూటింగ్స్ అన్ని బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చాయి. కానీ హీరోలెవరు సెట్స్ మీదకెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. కరోనా తగ్గాలే.. సెట్స్ మీదకెళ్ళాలే.. అంటూ ఇస్మార్ట్ డైలాగ్స్ చెబుతున్నారు హీరోలు. మరోపక్క రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా ఎప్పుడు సెట్స్ మీదకెళదామా అని చూస్తున్నారు. అయితే చిన్న హీరోలంతా సినిమా షూటింగ్స్ మొదలెడదామనుకుంటే.. ఒక్క స్టార్ హీరో కూడా సినిమా షూటింగ్ మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్ళడం లేదు. ఇలాంటి టైం లో మన సినిమా షూటింగ్స్ ఎలా మొదలెడదామని దర్శకులతో హీరోయిన్స్ కూడా ఆలోచనలో ఉన్నారట.
చిరు, నాగ్, వెంకీ, బాలయ్య లాంటి ఏజ్డ్ హీరోలు కరోనాకి భయపడుతున్నారు అంటే.. ఓకే. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటోళ్ళు కూడా కరోనాకి భయపడితే ఎలా అని చిన్న చిన్న హీరోలు, సినిమా షూటింగ్ ఉంటేనే పూట గడిచే సినీ కార్మికులు స్టార్ హీరోలపై గుస్సా అవుతున్నారట. మీరు మొదలెట్టండి సామి.. మేము సెట్స్ మీదకెళ్తాముగా అంటున్నారు వాళ్ళు. ఇప్పటికే చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సెట్స్ మీదకెళ్ళగా.. మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ కూడా రెడీ అవుతున్నాడు కానీ.. ఇంకా చిన్న హీరోలు, నాని, వరుణ్ లాంటివాళ్లు స్టార్ హీరోలు సెట్స్ మీదకెళితే ఒకింత ఊరట ఉంటుంది. కానీ ఆగస్ట్ కాదు.. కనీసం సెప్టెంబర్ కూడా షూటింగ్స్ జరుగుతాయంటే ఇప్పుడున్న కరోనా పరిస్థితి వలన సాధ్యమయ్యేపని కాదు. మరి కరోనాకి భయపడకుండా స్టార్ హీరోలేమైనా సాహసాలు చేస్తే తప్ప.. సినిమా ఇండస్ట్రీ గాడిన పడదంటున్నారు. చూద్దాం ముందు ముందు కరోనా కాలం ఎలా ఉండబోతుందో అనేది.