Advertisementt

సర్కారు వారి పాటలో హీరోయిన్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్..

Mon 06th Jul 2020 11:43 AM
sarkaru vari pata,parashuram,keerthy suresh  సర్కారు వారి పాటలో హీరోయిన్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్..
Latest update from Sarkaru vaari paata. సర్కారు వారి పాటలో హీరోయిన్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్..
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు తర్వాతి చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రీ లుక్ పోస్టర్ రిలీజయింది మొదలు, ఎప్పటికప్పుడు ఏవేవో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ పాత్రపై అనధికార అప్డేట్ బయటకి వచ్చింది.

బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో సాగే ఈ కథ, ఎక్కువ భాగం బ్యాంకుల్లోనే జరుగుతుందట. అందుకోసం హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోలో బ్యాంక్ సెట్ ని వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ బ్యాంకింగ్ ఎంప్లాయిగా కనిపించనుందట. బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తూ ఇంటిలిజెంట్ అయిన మహేష్ ప్రేమలో పడుతుందని అంటున్నారు. 

సర్కారు వారి పాట అటు మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందట. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, ఇంకా సామాజిక సందేశం మొదలగు అంశాలతో కూడుకున్నటువంటి ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా కారణంగా ఇంకా షూటింగ్ మొదలవ్వలేదు. కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే సర్కారు వారి పాట సెట్స్ మీదకి వెళ్లనుందట.

Latest update from Sarkaru vaari paata.:

Latest update from Sarkaru vaari paata.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ