ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ గర్ల్ రష్మిక మందన్న స్టార్ హీరోల సినిమాలని అవకాశాలతో ఎప్పటికప్పుడు అవాక్కవుతూనే ఉంది. అయితే తాను మొదటి నుండి కథలు విని అందులో రెండే రెండు అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకుని మరీ ఆ సినిమా ఒప్పుకుంటున్నా అని చెబుతుంది. ఆ రెండు అంశాలు నా మనసుకు నచ్చేవిగా ఉండాలి. అందుకే కథలో ఆ రెండు అంశాలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తా అంటుంది. ఇంతకీ రష్మికకి నచ్చిన ఆ రెండు అంశాలు ఏమిటంటే.... ఒకటి కామెడీ, మరొకటి ఎమోషన్ అంట. భావోద్వేగం, వినోదం అనే వాటినే ప్రేక్షకులు ఎక్కువగా లైక్ చేస్తారు. నేను ఎంచుకున్న కథల్లో భావోద్వేగంతో ప్రేక్షకుడు కంట తడైనా పెట్టాలి, లేదంటే నా పాత్రతో ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతూ అయినా బయటకి రావాలి. అందుకే నేను ఎంచుకునే కథల్లో ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉండేలా చూసుకుంటా అంటుంది.
నా మొదటి సినిమా స్క్రిప్ట్ నుండి నేను అదే సూత్రాన్ని పాటిస్తున్నా. మొదటి సినిమా ఛలో.. ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుంది. ఇక రెండోది గీత గోవిందం. గీత గోవిందంలో కామెడీతో కితకితలు పుట్టిస్తూనే గీతగా ఎమోషన్ ని చక్కగా పండించగలిగాను. తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ చిత్రాలను చూసినా నేను చెప్పిన కామెడీ, ఎమోషన్ రెండు కనబడతాయి అని చెబుతుంది రష్మిక మందన్న.