Advertisementt

టాలీవుడ్ లోకి మరో వారసుడి ఎంట్రీ..

Sun 05th Jul 2020 01:50 PM
satish vegesna,shatamanam bhavati,telugu,nepotism  టాలీవుడ్ లోకి మరో వారసుడి ఎంట్రీ..
Satish Vegesna launching his son..? టాలీవుడ్ లోకి మరో వారసుడి ఎంట్రీ..
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్ లో వారసత్వంపై ఎంత చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ వారసత్వం కేవలం బాలీవుడ్ కే పరిమితం కాదు. ప్రతీ సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది. ఆ మాటకొస్తే ప్రతీ ఫీల్డ్ లో ఉంది. రాజకీయాల్లో, వ్యాపారాల్లో అంతటా కనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో దాదాపుగా అందరూ వారసత్వంగా వచ్చిన వారే కనిపిస్తారు. అలా అని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్ళు హీరోలు కాలేరా అంటే అదీ లేదు.

అయితే తాజాగా టాలీవుడ్ లోకి మరో వారసుడు రాబోతున్నాడట. శతమానం భవతి సినిమా ద్వారా డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న, తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడట. సతీష్ వేగేశ్న ఇటు దర్శకుడిగా సినిమాలూ తీస్తూనే నిర్మాతగానూ మారాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న నాంది సినిమాకి సతీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

అయితే తన కొడుకుని హీరోగా లాంచ్ చేసే సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం అతని కుమారుడు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని టాక్. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక సమాచారం బయటకి వస్తుందని అంటున్నారు.

Satish Vegesna launching his son..?:

Satish Vegesna launching his son..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ