Advertisementt

మెగా పవర్ స్టార్ కూడా దిగుతున్నాడు..!

Mon 06th Jul 2020 04:30 PM
ram charan,web series,producer,mega power star,aha,ott  మెగా పవర్ స్టార్ కూడా దిగుతున్నాడు..!
Mega Power star Ram Charan Eye on Web Series మెగా పవర్ స్టార్ కూడా దిగుతున్నాడు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో అందరూ ఇంట్లోనే ఉంటూ దొరికిన సినిమా దొరికినట్టు.. ఓటీటీలలో ఎగబడి చూస్తున్నారు. కేవలం సినిమాలే కాదు.. వెబ్ సీరిస్‌లను వదలడం లేదు. ఫ్యూచర్ మొత్తం ఓటీటీ పరం అయ్యేలా కనబడుతుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. అందుకే వెబ్ సీరిస్‌లో నటించడానికి హీరోలు, హీరోయిన్స్ కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత బాలీవుడ్ ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌లోకి దిగింది. అలాగే నిత్యా మీనన్ కూడా బాలీవుడ్ వెబ్ సీరీస్‌లో నటిస్తుంది. మరి ఇప్పుడు సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సిరీస్‌ల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది. అందుకే చాలామంది నటులు వెబ్ సీరీస్ వైపు అడుగులు వేస్తున్నారు.
తాజాగా హీరో రామ్ చరణ్‌కి వెబ్ సీరీస్ మీద ఆసక్తి కలిగిందట. స్టార్ హీరోగా ఉన్నప్పుడే రామ్ చరణ్ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి తన తండ్రి చిరు సినిమాలను వరసగా నిర్మిస్తున్నాడు. మరోపక్క సక్సెస్ ఫుల్ హీరోగానూ అదరగొట్టేస్తున్నాడు. అయితే ఫ్యూచర్‌లో వెబ్ సీరీస్‌లకే ప్రాధాన్యత ఉంటుందని గమనించిన రామ్ చరణ్ ఇప్పుడు వెబ్ సీరీస్ నిర్మించాలనే ప్లాన్ చేస్తున్నాడట. తాను నిర్మించబోయే వెబ్ సీరీస్‌లో భారీ స్టార్లు, సినిమాని మించే బ‌డ్జెట్‌తో.. తెర‌కెక్కించాల‌న్న ఆలోచన‌లో రామ్ చరణ్ ఉన్నాడ‌ట‌. అయితే రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కబోయే వెబ్ సీరీస్ అరవింద్ ‘ఆహా’ కోస‌మా? లేదా.. ప్రస్తుతం టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్న మరో ఓటీటీ వేదిక కోస‌మా? అనేది తెలియాల్సివుంది.

Mega Power star Ram Charan Eye on Web Series :

Ram Charan will Produce Web series soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ