Advertisementt

సూపర్ మాన్ గా బాలయ్య..?

Sun 05th Jul 2020 06:55 AM
bb3,balayya,boyapati,miryala ravinder reddy,monarch,superman  సూపర్ మాన్ గా బాలయ్య..?
Balayya is Super Man.. Not MOnarch..? సూపర్ మాన్ గా బాలయ్య..?
Advertisement
Ads by CJ

రూలర్ చిత్రం తర్వాత బాలయ్య, దర్శకుడు బోయపాటితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకి సింహా, లెజెండ్ తరహాలోనే బోయపాటి మళ్ళీ హిట్ అందిస్తాడని అనుకుంటున్నారు. అయితే బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి చిన్నపాటి వీడియో గ్లింప్స్ ని విడుదల చేసారు.

ఈ గ్లింప్స్ వీడియోకి యూట్యూబ్ లో ఏకంగా పదిమిలియన్ల వ్యూస్ వచ్చాయి. దాంతో బాలయ్య అభిమానుల్లో బాగా నమ్మకం ఏర్పడింది. అయితే ఇంకా టైటిల్ నిర్ణయింపబడని ఈ సినిమా గురించి అనేక కథనాలు వస్తున్నాయి. సినిమా టైటిల్ విషయమై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్న నేపథ్యంలో పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టాలని డిసైడ్ అయ్యారట. అందుకే మోనార్క్ టైటిల్ పై కన్ఫర్మ్ అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరో ఆసక్తికర టైటిల్ బయటకి వచ్చింది. మోనార్క్ స్థానంలో సూపర్ మ్యాన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మరి ఈ విషయమై చిత్రబృందం అధికారికంగా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Balayya is Super Man.. Not MOnarch..?:

Balayya is Super Man.. Not MOnarch..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ