విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తుంది. నారప్ప భార్యగా ప్రియమణి సుందరమ్మగా కనిపించనుంది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచానాలు లేవు. కానీ నారప్పగా వెంకటేష్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి అందరి అటెన్షన్ ఈ సినిమాపైకి మళ్ళింది.
అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ కి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుగ్గా కంచరపాలెం నటుడు కార్తీక్ నటిస్తున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్తీకు లుక్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాలో కార్తీక్ పాత్రపేరు ముని కన్నా అని తెలుస్తుంది. సైకిల్ పై సాదా సీదా లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది.
అనంతపురం ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా చిత్రీకరణని వాయిదా వేసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత మళ్లీ చిత్రీకరణ జరుపుకోనుందని అంటున్నారు.