Advertisementt

అజయ్ దేవగన్ ‘మైదాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Sun 05th Jul 2020 12:14 PM
ajay devgn,maidaan,independence day,august 13,2021,release date  అజయ్ దేవగన్ ‘మైదాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Ajay Devgn Maidaan Movie Release Date Fixed అజయ్ దేవగన్ ‘మైదాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

ఇండిపెండెన్స్ డే  కానుకగా ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అజయ్ దేవగన్ ‘మైదాన్’

భారత ఫుట్ బాల్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. ఫుట్ బాల్ కోచ్‌గా అజయ్ దేవగన్ నటిస్తోన్న మైదాన్‌ను క్రీడా నేపథ్యంలో ఒక స్ఫూర్తిమంతమైన కథగా నిర్మిస్తున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా మైదాన్‌ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్‌ సహకారంతో జీ స్టూడియోస్ బేన‌ర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

Ajay Devgn Maidaan Movie Release Date Fixed :

Ajay Devgn’s ‘Maidaan’ Releasing For Independence Day On August 13, 2021 In Hindi, Telugu, Tamil And Malayalam Languages

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ