బాహుబలి సినిమాలో భళ్ళాలదేవుడిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన రానా దగ్గుబాటి, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. హీరోగా, విలన్ గా రానా ఏది చేసినా స్పెషల్ గా ఉంటుంది. సురేష్ బాబు కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా, నిర్మాతగానూ మారాడు. ఇక ముందు నటుడిగానే కాకుండా నిర్మాతగా బిజీగా మారనున్నాడు. మొన్నటికి మొన్న రానా సమర్పణలో తెరకెక్కిన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అందుకె ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ మేరకు రానా టార్గెట్ పిల్లలని టార్గెట్ చేస్తూ యానిమేషన్స్ ఫిలిమ్స్ రూపొందించనున్నాడట. ఈ మేరకు వర్క్ స్టార్ట్ అయిందని అంటున్నారు. ఈ సంవత్సరం చివరికల్లా యానిమేషన్స్ రెడీ అయ్యి రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. పిల్లల కోసం యానిమేషన్స్ ఫిలిమ్స్ ని కంటిన్యూ చేయనున్నారట.
ప్రస్తుతం రానా నటించిన అరణ్య చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడ్డ ఈ చిత్రం థియేటర్లు ఓపెన్ కాగానే రిలీజ్ అవనుంది. ఇక వేణూ ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం దాదాపుగా 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రానాకి జోడీగా ఫిదా ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.