Advertisementt

రకుల్ మొత్తానికి మనసు మార్చుకుంది!

Sat 04th Jul 2020 06:20 PM
rakul preet singh,wanted,performance,oriented roles,heroine  రకుల్ మొత్తానికి మనసు మార్చుకుంది!
Big Change in Heroine Rakul Preet singh రకుల్ మొత్తానికి మనసు మార్చుకుంది!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ ఓ ఐదేళ్లు దూసుకెళ్తే చాలనుకుంటారు. కానీ దేవుడి దయ వలన నేను దశాబ్డం దగ్గరవుతున్నా ఇంకా సినిమా అవకాశాలతో బిజీగానే ఉన్నాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఓ ఐదేళ్లు కెరీర్ ఫాస్ట్ గా కొనసాగితే చాలనుకున్నాను. కానీ ఇప్పటికి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయంటుంది. తాను సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాలేదని.. మా ఫ్యామిలిలో ఎవరు సినిమా నేపథ్యం ఉన్న వాళ్ళు లేరని.. ఎవరి అండదండలు లేకుండా నాపై నాకున్న నమ్మకంతోనే ఇన్నేళ్లు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను అని చెబుతుంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుని.. వరస సినిమాల్తో బిజీ అయ్యి.. నన్ను నేను ఈ రంగుల ప్రపంచంలో నిలబెట్టుకున్నా అని చెబుతుంది.

నేను సినిమా కెరీర్ మొదలుపెట్టినప్పుడు వరస అవకాశాలతో క్షణం తీరిక లేని జీవితాన్ని గడపాలనుకున్నాను. ఇప్పుడు నేననుకున్న కెరీర్ ని మనస్ఫూర్తిగా కొనసాగిస్తున్నాను అని చెబుతుంది రకుల్ ప్రీత్. ఒక్కోసారి నా కెరీర్ గురించి ఆలోచిస్తే.. ఇదేదో ఒక కలలా అనిపిస్తుంది. నటిగా నన్ను నేను మరింత సానబెట్టాల్సి ఉంది. ఇంకా కెరీర్లో గుర్తిండిపోయే... ప్రేక్షకులకు దగ్గరయ్యి.. వాళ్ళ మదిలో ఎప్పటికి నిలిచిపోయే పాత్రలను చెయ్యాలని ఉంది అని చెబుతుంది రకుల్. మరి ఇప్పుడు రకుల్ కెరీర్ ఊగిసలాటలో ఉంది. సౌత్ లో పెద్దగా అవకాశాలు లేని రకుల్ కి బాలీవుడ్ లో మాత్రం ఒకటీ అరా సినిమాలున్నాయి. ఇలాంటి టైం లో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలంటే కష్టమే సుమీ.. 

Big Change in Heroine Rakul Preet singh:

Rakul Preet singh wanted performance oriented roles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ