రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్ గెడ్డం తీసేసి కోర మీసంలో అదిరిపోయే లుక్ లోకి మారాడు. అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో అల్లూరి పాత్రలో ఎంత అద్భుతంగా ఉన్నాడో... ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ వీడియో లో చూసి మెగా ఫాన్స్ పండగ చేసుకున్నారు. రామ్ చరణ్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లోకెల్లా ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ లుక్ హైలెట్ అనేలా మెయింటింగ్ చేస్తాడని అనుకున్నారు. అయితే రామ్ చరణ్ తాజాగా అల్లూరి లుక్ నుండి లాక్ డౌన్ లుక్ లోకి మారిపోయాడు. కరోనా లాక్ డౌన్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడినా.. రామ్ చరణ్ చాతి రోజులు అదే అల్లూరి లుక్ లో ఉండిపోయాడు. ఆయితే గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ బయట కనబడటం మానేసాడు.
కానీ తాజాగా జానీ మాస్టర్ పుట్టిన రోజు సందర్భంగా జానీ మాస్టర్ కి బర్త్ డే విషెస్ చెప్పే క్రమంలో రామ్ చరణ్ ఓ వీడియో ని వదిలాడు. ఆ వీడియో లో రామ్ చరణ్ మునుపుటి రంగస్థలం లుక్ అంటే.. సుకుమార్ సినిమా రంగస్థలంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్ర కోసం గెడ్డం పెంచి హెయిర్ పెంచి కనిపించాడు. గుబురు గెడ్డంతో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఎలా ఉన్నడో ఇప్పుడు లాక్ డౌన్ లో రామ్ చరణ్ లుక్ అలా ఉంది. మరి రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ కోసం లుక్ మార్చాలి. కానీ రామ్ చరణ్ ఇలా పెంచాడు అంటే.. ఒకటి లాక్ డౌన్ కారణమై ఉండాలి. లేదంటే చిరు ఆచార్య లో రామ్ చరణ్ ఓ రోల్ పోషిస్తున్నాడు. ఒకవేళ ఆచార్య కోసం ఎమన్నా రామ్ చరణ్ గెటప్ చేంజ్ చేశాడా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రామ్ చరణ్ మాత్రం గుబురు గెడ్డం, లాంగ్ హెయిర్ తో కాస్త కొత్తగా అనిపిస్తున్నాడు.