ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Not keerthy In Chaitanyas film.. She got that offer..?

చైతన్యతో కీర్తి కాదు.. ఆమెకే అవకాశం..?

Not keerthy In Chaitanyas film.. She got that offer..?

అక్కినేని నాగచైతన్య వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మజిలీ, వెంకీమామా చిత్రాలు మంచి ఫలితాలని ఇచ్చాయి. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకోని ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ అవనుందని అంటున్నారు.

అయితే ఈ సినిమా అనంతరం నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. థ్యాంక్యూ అనే టైటిల్ తో తెరకెక్కుతుందని వార్తలు వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకుందామని అనుకున్నారట. కానీ కీర్తి సురేష్ రంగ్ దే, మిస్ ఇండియా, సర్కారు వారి పాట చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆమె స్థానంలో రష్మిక మందన్నాని తీసుకోవాలని చూస్తున్నారట.

రష్మిక మందన్నా ప్రస్తుతం బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న రష్మిక నాగచైతన్య సరసన హీరోయిన్ గా ఒప్పుకుంటుందా లేదా చూడాలి.

Not keerthy In Chaitanyas film.. She got that offer..?

nagachaitanya
keerthy suresh
rashmika mandanna
vikram k kumar
shekar kammula