మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమా తర్వాత పట్టాలెక్కబోయే రీమేక్ చిత్రం లూసిఫర్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగు నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్టులో మార్పులు చేసిన సుజిత్, డైలాగ్ వెర్షన్ పై కూర్చున్నాడట. సాయి మాధవ్ బుర్రా రాస్తున్న డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నాయట. ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్లు ఓ రేంజ్ లో ఉండనున్న నేపథ్యంలో సాయిమాధవ్ పవర్ ఫుల్ డైలాగులతో నింపేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ చేస్తుందని వార్తలు వచ్చాయి.
తాజాగా జగపతిబాబు కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. హీరోగా ఎన్నో చిత్రాలు చేసిన జగపతి బాబు విలన్ పాత్రలు వేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల చిత్రాల్లో సైతం విలన్ గా నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా ఏ పెద్ద హీరో సినిమా అయినా జగపతిబాబు విలన్ గా ఉంటున్నాడు. మెగాస్టార్ లూసిఫర్ లోనూ అలాంటి పాత్రే జగపతి బాబు పోషించనున్నాడని అంటున్నారు. మరి ఈ విషయమై చిత్రబృందం స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.