లాక్డౌన్ నుండి ఇంట్లోనే సరదాగా తన పిల్లలతో కాలం గడుపుతున్న మహేష్ బాబు, ఆ సరదా కాలక్షేపాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. సోషల్ మీడియాలో మహేష్ బాబుకి ఫాలోయింగ్ ఎక్కువే. ట్విట్టర్ లో అయితే మరీనూ.. తాజాగా మహేష్ బాబుని ట్విట్టర్ లో ఫాలో అయ్యేవారి సంఖ్య కోటికి చేరింది. అంటే మహేష్ ట్విట్టర్ ద్వారా చెప్పే సందేశాలు కోటి మందికి చేరుతాయన్నమాట.
అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఉండే అంశాల్నే పరిగణలోకి తీసుకుని రికార్డులుగా చెప్పుకుంటున్న అలవాటు బాగా పెరిగింది. ఆ లెక్కన చూసుకుంటే మహేష్ బాబు అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు. దక్షిణాది హీరోలందరిలోకి ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించాడు. సౌత్ లో ఏ హీరోకి కూడా కోటి మంది ఫాలోవర్స్ లేరు.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో నివేథా థామస్ సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందట. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.