ఏదైనా సినిమా విడుదలయ్యాక ఆ సినిమాకి రివ్యూ రైటర్స్ చకచకా రివ్యూస్ ఇచ్చేస్తుంటారు. ఆ రివ్యూస్ చూసే చాలామంది ప్రేక్షకులు సినిమాలకు వెళతారు. అందులో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. రివ్యూలకు ప్రాముఖ్యతనిస్తారు. మరి రివ్యూ రైటర్స్ కూడా సినిమా చూసి బావుంది అంటే బావుంది అని.. బాలేదు అంటే బాలేదని విశ్లేషణ రాస్తారు. ఎక్కడో కొంతమంది మాత్రం డబ్బుకి ఆశపడి.. బాలేని సినిమాని కూడా బావుంది అని రాస్తారు కానీ.. ఎవ్వరు బాలేని సినిమాని బావుంది మాత్రం రాయరు. కానీ కొంతమంది హీరోలు, దర్శకనిర్మాతలు మాత్రం మా సినిమా బావున్నప్పటికీ.. బాలేదని రివ్యూస్ రాయడం వలనే మా సినిమాకి కలెక్షన్స్ రాలేదు అంటూ రివ్యూ రైటర్స్ మీద ఫైర్ అవుతుంటారు. తాజాగా ఇలానే ఓ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమ సినిమా బాలేదని రాశారంటూ రివ్యూ రైటర్స్ మీద ఫైర్ అయ్యాడు. ఎందుకంటే సదరు మ్యూజిక్ డైరెక్టర్ గారు.. ఆ సినిమాకి పెట్టుబడి కూడా పెట్టారు.
ఆయనే రఘు కుంచె. మ్యూజిక్ డైరెక్టర్ గా పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేని.. రఘు కుంచె ఇప్పుడు ఆర్టిస్ట్ అవతారంతో పాటుగా 47 డేస్ అనే సినిమాకి వన్ ఆఫ్ ద పార్టనర్‌గా ఉన్నాడు. 47 డేస్ తాజాగా నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై కనీసం యావరేజ్ టాక్ కూడా తేచ్చుకోలేదు. ఆ సినిమాకి రివ్యూ రైటర్స్ పూర్ రేటింగ్స్ ఇవ్వడంతో మండిన రఘు కుంచె.. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న పది రూపాయల సినిమాలు చూసి.. ఆ సినిమాలతో పోల్చి తన రూపాయి సినిమా బాలేదని రాస్తున్నారు. విడుదలయ్యాక.. రివ్యూస్ చూస్తుంటే.. మా సినిమా ఈపాటికే దుకాణం సర్దేసేది అని అంటున్నాడు రఘు కుంచె. రివ్యూస్ తో సంబంధం లేకుండా ఓటీటీలో మా సినిమా చూస్తున్నారని.. సగటు ప్రేక్షకుడు మా సినిమాని ఇష్టపడ్డాడని చెబుతున్నాడు.