Advertisementt

వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విలక్షణ నటుడు..?

Wed 01st Jul 2020 04:11 PM
prakash raj,anil sunkara,madhubabu shadow,telugu,ott,web series  వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విలక్షణ నటుడు..?
Prakash Raj entry into Digital world..? వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విలక్షణ నటుడు..?
Advertisement
Ads by CJ

థియేటర్లు మూతబడిన కారణంగా జనాలు ఓటీటీలకి బాగా అలవాటు పడ్డారు. థియేటర్లో వచ్చే అనుభవం ఓటీటీ అందించలేకపోయినా ప్రస్తుతం జనాలకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అదే కాబట్టి ఎగబడి మరీ చూసేస్తున్నారు. అయితే ఓటీటీలకి పెరుగుతున్న ఆదరణ కారణంగా సినిమా తారలు ఈ వేదిక కోసం నటించడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఓటీటీలో నటించాలంటే చిన్నచూపుగా భావించేవారు.

కానీ పరిస్థితులు మారడంతో వెబ్ సిరీస్ లలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ చేయడానికి . తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు కూడా బయటకి వచ్చింది. భారతీయ చిత్రపరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్ ఎన్నో సినిమాలు చేసాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు. మరెన్నో ప్రశంసలు దక్కించుకున్నాడు.

అయితే మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా తాను కూడా వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మధుబాబు ఫేమస్ నవలా సిరీస్ అయిన షాడో ఆధారంగా రూపొందిస్తున్న వెబ్ సిరీస్ కి నిర్మాతగా పనిచేస్తున్న అనిల్ సుంకర, మరో వెబ్ సిరీ సి తెరకెక్కించాలని అనుకుంటున్నారని, అందులో  ప్రధాన పాత్రగా ప్రకాష్ రాజ్ చేయబోతున్నాడని అంటున్నారు. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఆ వెబ్ సిరీస్ స్క్రిప్టుని స్వయంగా ప్రకాష్ రాజ్ రాస్తున్నాడట. 

Prakash Raj entry into Digital world..?:

Prakash Raj entry into Digital world..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ