టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్ళి, కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్, తాను ప్రేమించిన అమ్మాయి షాలినీని వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. అయితే ఏప్రిల్ నెలలో దుబాయ్ లోని ఖరీదైన హోటల్ లో జరగాల్సిన నితిన్ వివాహం, కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత అభిమానులు, ఇండస్ట్రీకి చెందిన అందరి సమక్షంలో చేసుకుందామని డిసైడ్ అయ్యాడు.
అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజు రోజుకీ కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దాంతో నితిన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని అంటున్నారు. హీరో నిఖిల్ మాదిరిగానే బంధువుల సమక్షంలో ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం పెళ్ళి వేడుక జరుపుకోనున్నాడట. ఈ మేరకు ఈనెల 26వ తేదీని ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌస్ లో ఈ వేడుక జరగనుందట.
నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమాలో నటిస్తుండగా, ఇంకా బాలీవుడ్ రీమేక్ అయిన అంధాధున్, క్రిష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమాని ఒప్పుకున్నాడు.