Advertisementt

పెళ్లి, పిల్లలు మధురక్షణాలంటున్న నమ్రత!

Thu 02nd Jul 2020 11:32 AM
namrata shirodkar,actress,mahesh babu wife,chit chat,live,netizens  పెళ్లి, పిల్లలు మధురక్షణాలంటున్న నమ్రత!
Namrata Shirodkar Chit chat with Fans పెళ్లి, పిల్లలు మధురక్షణాలంటున్న నమ్రత!
Advertisement
Ads by CJ

నమ్రత మహేష్‌ని పెళ్లి చేసుకోకముందు ‘వంశీ’ సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటించేటప్పుడే మహేష్ - నమ్రతలు ప్రేమించి పెళ్లాడారు. అయితే పెళ్లి తర్వాత గృహిణిగా మహేష్ కి వెన్నంటి ఉంటూ.. కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్న నమ్రత సూపర్ విమెన్ టైప్. మహేష్ విజయంలో నమ్రతకు సగ భాగం ఇవ్వాలి. మహేష్ ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పుడు పిల్లలు గౌతమ్, సితారల బాధ్యతను తీసుకుని.. మహేష్‌కి బర్డెన్ లేకుండా చెయ్యడమే కాదు... మహేష్ వ్యాపారాలన్నీ నమ్రత ఒంటి చేత్తో చక్కబెడుతుంది  అనే టాక్ కూడా అంది. అయితే తాజాగా ఆస్క్ మీ యువర్ క్వశ్చన్ సెషన్ లో నమ్రతని అభిమానులు కొన్ని కొంటె ప్రశ్నలు వేశారు. వాటికీ నమ్రత కూడా స్టైలిష్ సమాధానాలిచ్చింది.

మీకు ఇష్టమైన హీరో ఎవరంటే.. ఎవరని చెబుతుంది మహేష్ అని చెప్పింది. అలాగే మీకు ఇష్టమైన వంటకం అంటే మ్యాగీ నూడిల్స్ అంది. అలాగే మహేష్ నటించిన సినిమాల్లో.. మహేష్ సూపర్ హిట్ చిత్రాలైన పోకిరి, దూకుడు, ఒక్కడు లాంటి సినిమా పేర్లు చెప్పింది. అంతేకాకుండా మహేష్ ని పెళ్లి చేసుకోవడం తనకి మధుర క్షణం అని చెప్పింది. అలాగే మరొక మధుర క్షణం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం అని చెప్పిన నమ్రత మహేష్ సినిమా విషయాల్లో కలగజేసుకోనని అంటుంది. అందుకే భవిష్యత్తులో పూరి తో మహేష్ సినిమా ఉంటుందో లేదో చెప్పలేనని చెప్పింది. పెళ్ళికి ముందు మహేష్ తో నటించాను.. కానీ భవిష్యత్తులో మళ్లీ మహేష్ తో నటించడం కుదురుతుందో.. లేదో.. చూడాలని చెబుతుంది నమ్రత.

Namrata Shirodkar Chit chat with Fans:

Namrata Shirodkar answers to Netizens Questions 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ