Advertisementt

ఉప్పెన దర్శకుడు భలే ఛాన్స్ పట్టేసాడే.. ఏకంగా చరణ్ తోనే..?

Wed 01st Jul 2020 10:31 AM
buchibabu sana,ram charan,uppena,sai dharam tej,vaishnav tej,kriti shetty  ఉప్పెన దర్శకుడు భలే ఛాన్స్ పట్టేసాడే.. ఏకంగా చరణ్ తోనే..?
Uppena director movie with Megapower star..? ఉప్పెన దర్శకుడు భలే ఛాన్స్ పట్టేసాడే.. ఏకంగా చరణ్ తోనే..?
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా.. ఉప్పెన.. క్రితిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఇప్పటి వరకూ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి.

నీ కన్ను నీలి సముద్రంతో పాటు ధక్ ధక్ ధక్ అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ పాటికే థియేటర్లో రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో హోల్డ్ లో పడింది. అయితే దర్శకుడిగా మొదటి సినిమాకే ఇలాంటి అవాంతరం ఎదురవడంతో బుచ్చిబాబు సానా ఫీల్ అవుతున్నాడట.

అయితే తాజాగా అతనికి కిక్ ఇచ్చే సంఘటన జరిగిందట. బుచ్చిబాబు సానా రామ్ చరణ్ కి కథ వినిపించాడట. కథ విన్న చరణ్ ఓకే అన్నాడని, భవిష్యత్తులో బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని టాక్. ప్రస్తుతం చరణ్ కి ఉన్న అన్ని కమిట్ మెంట్స్ పూర్తయ్యాక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశం ఉందట. మొత్తానికి ఉప్పెన సినిమాతో భలే అవకాశం పట్టేసాడు.. 

Uppena director movie with Megapower star..?:

Uppena director movie with Megapower star..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ