సౌత్ కుర్రాడే అయినా.. బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఏ ఫేస్ కుర్రాడిగా ఓ కేరెక్టర్ చేసినా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో అందరి ఆదరణ సంపాదించాడు. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ లో కామెడీని మిక్స్ చేసి చేసిన నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నవీన్ పోలిశెట్టికి సెటిల్ అనే పదం అంటే చాలా చిరాకట. ఎందుకంటే ప్రస్తుతం అందరూ చదువు అయ్యింది.. సెటిల్ ఎప్పుడు అవుతావు.. నీకన్నా చిన్నవాళ్ళే సెటిల్ అవుతున్నారు.. వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. వీళ్లు ఇక్కడ జాబ్ వచ్చి సెటిలయ్యారంటూ అందరూ చంపేస్తుంటారట. వాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు.. వీడు కెనడాలో సెటిల్ అయ్యాడు.. నువ్వెప్పుడూ సెటిలవుతావు అంటుంటారు.
సెటిల్ అంటే ఏమిటి. అందుకే నేను కూడా ఆ విధంగా సెటిల్ అవ్వకూడదనే కదా నా ఈ ప్రయత్నం అంటూ సమాధానం చెప్పేవాణ్ణి. నిజానికి సెటిల్ అయ్యే విషయాలన్నీ నేనెప్పుడో సాధించేసాను. ఎసైటిలో బిటెక్ చేసి లండన్‌లో జాబ్ చెయ్యడమే కాదు.. సొంత కారు, సొంత ఫ్లాట్ కూడా కొన్నాను. కానీ ఆ రకంగా సెటిల్ అవ్వడం ఇష్టం లేకనే కదా ఇలా సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లో నటించడం, అందులో పనిచెయ్యడం అంటే నాకు క్రేజీ, ప్రాణం అందుకే ఇలా అంటున్నాడు నవీన్ పోలిశెట్టి. అన్ని లగ్జరీలు అనుభవించాకే ఇలా అన్ని వదులుకుని ప్రష్టేషన్ అంచులకి వెళ్ళడానికి కారణం నటనంటే నాకున్న ఆసక్తి అంటున్నాడు. మరి సెటిల్ అంటే అన్నవారికి భలే సమాధానం చెప్పాడు ఈ ఏజెంట్ కుర్రాడు.