Advertisementt

‘బంగారు బుల్లోడు’ టీజ‌ర్ విడుదల

Wed 01st Jul 2020 09:24 AM
bangaru bullodu movie,teaser,allari naresh,birthday special,pooja jhaveri  ‘బంగారు బుల్లోడు’ టీజ‌ర్ విడుదల
Allari Naresh Bangaru Bullodu Movie Teaser Released ‘బంగారు బుల్లోడు’ టీజ‌ర్ విడుదల
Advertisement
Ads by CJ

అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘బంగారు బుల్లోడు’ టీజ‌ర్ రిలీజ్‌

కింగ్ ఆఫ్ కామెడీ టైమింగ్ అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘బంగారు బుల్లోడు’ సినిమా టీజ‌ర్ జూన్ 30 మ‌ధ్యాహ్నం 3:06 గంట‌ల‌కు విడుద‌ల‌య్యింది. పి.వి. గిరి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా అందాల తార పూజా ఝ‌వేరి న‌టిస్తోంది.

ఒక నిమిషం నిడివి క‌లిగిన ఈ టీజ‌ర్ ద్వారా ‘బంగారు బుల్లోడు’ చిత్రం ఆద్యంతం మ‌న‌ల్ని న‌వ్వుల్లో ముంచెత్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. కామెడీ టైమింగ్‌లో తాను కింగ్‌న‌ని మ‌రోసారి ఈ చిత్రంతో అల్ల‌రి న‌రేష్ నిరూపించబోతున్నారు. ఆయ‌న ఒక బ్యాంక్ ఉద్యోగి అనీ, ఆ బ్యాంక్ లాకర్‌లో ఉండే బంగారు న‌గ‌ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌నీ టీజ‌ర్ ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. స‌స్పెన్స్‌, సెంటిమెంట్ అంశాలు మేళ‌వించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

Click Here for Teaser

తారాగ‌ణం:

అల్ల‌రి న‌రేష్‌, పూజా ఝ‌వేరి, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీ, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్, స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, అజ‌య్ ఘోష్‌, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, అనంత్‌, భ‌ద్రం, సారిక రామ‌చంద్ర‌రావు.

సాంకేతిక బృందం:

సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి

సంగీతం: సాయికార్తీక్‌

సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వ‌ర్మ‌

ఆర్ట్‌: ఎన్‌. గాంధీ

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌

పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి

స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌

నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పి.వి. గిరి

బ్యాన‌ర్‌: ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌.

Allari Naresh Bangaru Bullodu Movie Teaser Released:

Bangaru Bullodu Movie Teaser Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ