Advertisementt

‘శ‌శి’ చిత్ర డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం!

Tue 30th Jun 2020 01:28 PM
sashi,hero aadi saikumar,srinivas naidu nadikatla,sashi movie latest update  ‘శ‌శి’ చిత్ర డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం!
Hero Aadi Saikumar started dubbing for Sashi ‘శ‌శి’ చిత్ర డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం!
Advertisement
Ads by CJ

ఆది సాయికుమార్ ‘శ‌శి’ చిత్రం డ‌బ్బింగ్‌ ప‌నులు ప్రారంభం

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న ‘శ‌శి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ నిర్మిస్తున్నారు. హీరో ఆది సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్ప‌డం ద్వారా సోమ‌వారం ‘శ‌శి’ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని బ్యాన‌ర్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఆది డ‌బ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశారు. లాక్‌డౌన్ ముగిసి, సినిమాల‌ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చిన దానికి అనుగుణంగా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ డ‌బ్బింగ్ ప‌నులు స్టార్ట్ చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని స‌రికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న జోడీగా సుర‌భి న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో నాయిక పాత్ర‌ను రాశీ సింగ్ పోషిస్తున్నారు. ఒక పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. ఆ పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ల‌వ్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ‘శ‌శి’ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తుండ‌గా, అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఆది సాయికుమార్‌, సుర‌భి, రాశీ సింగ్‌, వెన్నెల కిశోర్‌, తుల‌సి, జ‌య‌ప్ర‌కాష్‌, రాజీవ్ క‌న‌కాల‌, అజ‌య్‌, వైవా హ‌ర్ష‌, సుద‌ర్శ‌న్‌, స్వ‌ప్నిక‌, శిరీష‌, శ‌ర‌ణ్య‌, హ‌ర్ష‌, మ‌హేష్‌, కృష్ణ‌తేజ‌, భ‌ద్రం, వేణుగోపాల‌రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

సాంకేతిక బృందం:

స్క్రీన్‌ప్లే: మ‌ణికుమార్ చిన్నిమిల్లి

డైలాగ్స్‌: ఐ. ర‌వి

సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, అనంత శ్రీ‌రామ్‌, వెంగీ

మ్యూజిక్‌: అరుణ్ చిలువేరు

సినిమాటోగ్ర‌ఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి

ఆర్ట్‌: ర‌ఘు కుల‌క‌ర్ణి

ఫైట్స్: రియ‌ల్ స‌తీష్‌

కొరియోగ్ర‌ఫీ: విశ్వ ర‌ఘు

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

కో-డైరెక్ట‌ర్‌: సాయిర‌మేష్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌మేష్ మేడికొండ‌

నిర్మాత‌లు: ఆర్‌.పి. వ‌ర్మ‌, రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల‌

బ్యాన‌ర్‌: శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్‌

Hero Aadi Saikumar started dubbing for Sashi :

Sashi Movie Dubbing work Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ