తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకి అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. గత ముడు నెలలుగా సినిమా షూటింగులు లేక ఇబ్బంది పడిన వారందరికీ ఈ వార్త ఎంతో ఊరటని కలిగించింది. అనుమతులు రావడంతోనే అప్పటి వరకూ ఆగిపోయిన సీరియల్స్, సినిమా, టెలివిజన్ కి సంబంధించిన షూటింగులు స్టార్ట్ అయ్యాయి. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.
అయితే కరోనా సమయంలో సినిమా షూటింగులకి పెద్ద ఇబ్బంది ఏర్పడింది. ముఖ్యంగా నటీనటులు ఒకానొక విషయంలో ఆందోళనకి గురవుతున్నారు. షూటింగ్ అన్నాక మరీ అంటీముట్టనట్టు ఉన్నా కూడా కుదరదు. స్క్రిప్టు ప్రకారం కొన్ని చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అదే అందరికీ భయంగా మారింది. కరోనా రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. అందుకే షూటింగులు చేస్తున్నా కూడా ఆందోళన మాత్రం తగ్గట్లేదట.
ఈ నేపథ్యంలో రెజీనా కెసాండ్రా తన భయాన్ని బయటపెట్టింది. కరోనా టైమ్ లో ముద్దు సీన్లు, కౌగిలింతల సీన్లు చేయాలంటే భయంగా ఉందని, అలాంటి సీన్లు చేయడం ఇప్పట్లో కష్టమని చెబుతోంది. సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో సర్వసాధారణమే అయినా కరోనా కారణంగా ప్రాణాలని హాని కలుగుతుందేమోనన్న భయమే ఎక్కువగా ఉందని చెబుతోంది. ఏదేమైనా కరోనా వైరస్ తర్వాత సినిమా కథల్లోనూ మార్పులు చేసుకోవాల్సిందేనేమో..!