Advertisementt

రూమరే.. నమ్మవద్దు: రేణు దేశాయ్!

Mon 29th Jun 2020 05:26 PM
renu desai,clarity,acting,mahesh babu movie,sarkaru vaari paata  రూమరే.. నమ్మవద్దు: రేణు దేశాయ్!
Renu Desai Gave Clarity On Working In Mahesh Babu Movie రూమరే.. నమ్మవద్దు: రేణు దేశాయ్!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ భార్యగా కన్నా... ఆయన మాజీ భార్య గానే ఎక్కువ ప్రచారంలోకి వచ్చిన రేణు దేశాయ్.. పవన్‌తో విడాకులు తర్వాత రోజు వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం కూడా జీ తెలుగు కార్యక్రమాలను ప్రమోట్ చెయ్యడమే కాకుండా.. కొన్ని షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా రేణు దేశాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని.. అది కూడా మహేష్ సర్కారు వారి పాటతో అంటూ తెగ హడావిడి సోషల్ మీడియాలో కనబడుతుంది. అయితే నేను మళ్ళీ నటిస్తే మీరు నవ్వకుండా ఉంటారా అని అడుగుతున్న రేణు దేశాయ్.. మహేష్ సినిమాలో పక్కాగా నటిస్తున్నదని నమ్ముతున్నారు.

అయితే తాజాగా రేణు దేశాయ్ మహేష్ సినిమాలో మీరు నటిస్తున్నారట అనే న్యూస్ పై స్పందించింది. తాను ఈమధ్యన విన్న రూమర్స్ లో అతి పెద్ద రూమర్ ఇదే. నేను మహేష్ సినిమాలో నటిస్తున్నా అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఒకవేళ తనకి పెద్ద సినిమా అవకాశం వస్తే.. తానే ఓ ప్రకటన చేసి ఉండేదాన్ని అని.. అయితే తనకి నటించాలనే కోరిక ఉందని.. అయితే హీరోలకు తల్లిపాత్రలు చేస్తామని అన్నాను కానీ.. హీరోల చిన్నప్పుడు తల్లిపాత్రలు చేస్తా అని చెప్పడంతోనే ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని అంటుంది రేణు దేశాయ్. 

Renu Desai Gave Clarity On Working In Mahesh Babu Movie:

Renu Desai Clarity on Mahesh Babu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ