Advertisementt

గోపీచంద్ సీటీమార్.. అసిస్టెంటుగా కమెడియన్..?

Sun 28th Jun 2020 02:50 PM
sunil,gopi chand,sampath nandi,tamannah,seetimaar  గోపీచంద్ సీటీమార్.. అసిస్టెంటుగా కమెడియన్..?
comedian as a assistant coach in Gopichands Seetimaar..? గోపీచంద్ సీటీమార్.. అసిస్టెంటుగా కమెడియన్..?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరో గోపీచంద్ హిట్టు మాట విని చాలా రోజులు అవుతుంది. లౌక్యం సినిమా తర్వాత ఆయన కెరీర్లో హిట్టే లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా విజయాలని అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ అనే చిత్రం చేస్తున్న గోపీచంద్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమ్మాయిల జట్టుకి కోచ్ గా గోపీచంద్ కనిపిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర అమ్మాయిల జట్టుకి కోచ్ గా తమన్నా కనిపించనుంది. వీరిద్దరూ తలపడినపుడు వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయని అంటున్నారు. అయితే గోపీచంద్ కి అసిస్టెంట్ గా మరో కోచ్ ఉండనున్నాడట. ఈ అసిస్టెంట్ పాత్రలో కమెడియన్ సునీల్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు కమెడియన్ గా తనకి తిరుగులేదనిపించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు తగ్గించి మళ్ళీ కమెడియన్ గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కనిపించాడు. ఇప్పుడు సీటీమార్ చిత్రంలోనూ గోపీచంద్ కి అసిస్టెంట్ గా నవ్వుల పువ్వులు పూయించనున్నాడట. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని అంటున్నారు. మరి ఈ సినిమా ద్వారా అయినా కమెడియన్ గా కమ్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

comedian as a assistant coach in Gopichands Seetimaar..?:

comedian as a assistant coach in Gopichands Seetimaar..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ