Advertisementt

అన్నదమ్ముల దర్శకత్వంలో నాగార్జున సినిమా..?

Sun 28th Jun 2020 01:07 PM
nagarjuna,dhanush,selva raghavan,naan rudram  అన్నదమ్ముల దర్శకత్వంలో నాగార్జున సినిమా..?
Nagarjunas movie in brothers direction..? అన్నదమ్ముల దర్శకత్వంలో నాగార్జున సినిమా..?
Advertisement
Ads by CJ

తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో నాగార్జున సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నాన్ రుద్రమ్ అనే పేరుతో తెరమీదకి వచ్చిన ఈ సినిమాలో శరత్ కుమార్, ఎస్జే సూర్య, అరవింద్ స్వామి, అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ఉన్నారు. అయితే కొద్ది రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయింది. దాంతో ఇక సినిమా పూర్తిగా ఆగిపోయిందనే అనుకున్నారు.  నాగార్జున కూడా ఈ సినిమా విషయమై తనకేమీ తెలియదనీ, ధనుష్ స్పందిస్తేనే బాగుంటుందని చెప్పాడు. 

అయితే పూర్తిగా ఆగిపోయిందనుకున్న ఈ సినిమా మళ్ళీ స్టార్ట్ కానుందని అంటున్నారు. బడ్జెట్ ని తక్కువ చేసేందుకు గాను ఈ సినిమా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసాడట. అయితే ఈ సినిమాలోని కొన్నిముఖ్యమైన సీన్లని ధనుష్ అన్న సెల్వరాఘవన్ చిత్రీకరించనున్నాడట. యుగానికి ఒక్కడు తరహాలో ఉండే ఆ సీన్లని సెల్వ రాఘవన్ అయితే బాగా తీయగలడన్న ఉద్దేశ్యంతో దనుష్ ఆ పనిని తన అన్నకి అప్పగించనున్నాడట. మరి అన్నదమ్ములు దర్శకత్వం చేయనున్న ఈ సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాతో నాగార్జున బిజీగా ఉన్నాడు. 

Nagarjunas movie in brothers direction..?:

Nagarjunas movie in brothers direction..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ