తండ్రి, కూతురు అనుబంధం నేపథ్యంలో దర్శకుడు శివ ఏటూరి రెండో సినిమా
చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత ‘కరణం శ్రీనివాసరావు’. తొలి చిత్రం ‘అమ్మదీవెన’ విడుదల కాకుండానే దర్శకుడు ‘శివ ఏటూరి’ మరో సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సందర్భంగా దర్శకుడు శివ ఏటూరి మాట్లాడుతూ... ‘‘ఒక యువతి మానసిక సంఘర్షణ ప్రదానాంశంగా, తండ్రీ కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో కధ సాగుతుందన్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని దీనికి రచన విజయభారతి, ఎడిటింగ్ జానకిరామ్ పామరాజు, తండ్రి పాత్ర కోసం ఒక ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నాం త్వరలోనే నటీనటులు మిగతా టెక్నీషియన్స్ వివరాలు వెల్లడిస్తాం.. అన్నారు.
నిర్మాత కరణం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దర్శకుడు శివ ఏటూరి చెప్పిన కథ నచ్చిందని, ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడలోను నిర్మించబోతున్నాం, కరోనా ప్రభావం తగ్గిన వెంటనే షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.