కరోనా అనే మహావిపత్తు నుంచి కాపాడే ప్రయత్నంలో భాగంగా ఏర్పడిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) మా మీడియా రంగాన్ని కూడా ఆదుకోవడాన్ని మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గర్విస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సిసలైన ఆపద్బాంధవుడని మరోసారి నిరూపించుకున్నారు. ఈరోజు కూడా మా మీడియా మిత్రులందరికీ నిత్యావసర వస్తువులు అందాయి. మంచి మనసును చాటుకున్న మెగా స్టార్ చిరంజీవి గారికీ, సినిమా పెద్దలకూ, సీసీసీకీ మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతోంది.
ఇట్లు
సురేష్ కొండేటి (అధ్యక్షుడు)
ఇ. జనార్ధన్ రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
ఎఫ్.సి.ఎ.