Advertisementt

పవన్ సినిమాలో డాన్సుల్లేని పాటలు.. కారణం ఇదే..

Fri 26th Jun 2020 04:09 PM
pspk,pawan kalyan,krish,vakeel saab,keeravani  పవన్ సినిమాలో డాన్సుల్లేని పాటలు.. కారణం ఇదే..
No dances for Pawan Krish movie songs.. పవన్ సినిమాలో డాన్సుల్లేని పాటలు.. కారణం ఇదే..
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో సినిమాని కూడా ఒప్పుకున్నాడు. పీరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడట.

అయితే గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా పాటల విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉండనున్నాయట. అవి కూడా బ్యాగ్రౌండ్ లో వచ్చేవే అయి ఉంటాయని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, ఈ సినిమా  పాటల్లో డాన్సులు ఉండకూడదని చెప్పాడట. అయితే దానికి కారణం లేకపోలేదు. 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా ఆక్టివ్ గా ఉండడంతో హీరోయిన్ తో రొమాన్స్ చేసే సన్నివేశాలు, డాన్స్ నంబర్స్ చేయడం వల్ల పార్టీకి ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం కలుగుతుందన్న కారణంగా బాధ్యతగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు.

No dances for Pawan Krish movie songs..:

No dances for Pawan Krish movie songs..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ