తెలుగు టెలివిజన్ పై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకుని పాపులర్ గా మారిన రియాలిటీ షో నాలుగవ సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన మూడవ సీజన్ సక్సెస్ తర్వాత వస్తున్న నాలుగవ సీజన్లో చాలా మార్పులు ఉండబోతున్నాయట. మొదటగా బిగ్ బాస్ మొదటి సీజన్ స్టార్ట్ అయినపుడు 14 మంది కంటెస్టెంట్లని తీసుకున్నారు. 70 రోజుల పాటు ఈ షో కొనసాగింది.
రెండు, మూడవ సీజన్లని వందరోజులకి పెంచారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ భారీగా ఉండడంతో నాలుగవ సీజన్ ని కేవలం 50రోజులకే పరిమితం చేయాలని చూస్తున్నారట. 12మంది కంటెస్టెంట్లతో యాభైరోజుల పాటు టెలివిజన్ ప్రేక్షకులకి వినోదాన్ని పంచడానికి రెడీ అవుతుందట. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసారట. అయితే ఇవే కాకుండా ఇంకా చాలా మార్పులు బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కనిపించబోతున్నాయట.
బెడ్ రూమ్స్ నుండి వాష్ రూమ్స్ వరకి ప్రతీదీ సెపరేట్ గా ఉండబోతుందట. గతంలోలా కాకుండా టాస్కుల విషయంలోనూ చాలా మార్పులు రానున్నాయట. కరోనా కారణంగా ప్రతీదీ మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ బాస్ కి కూడా తప్పలేదు.