అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన ఆహా యాప్ వందశాతం తెలుగు వినోదాన్ని అందించే దిశగా కృషి చేస్తుంది. ఓటీటీలో మేజర్ ఫీల్డ్ ని ఆక్రమించిన అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లకి పోటీ పడుతూ తెలుగు కంటెంట్ ఇచ్చేందుకు అల్ల అరవింద్ అదిరిపోయే ప్లానింగ్ తో వస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఆహా కోసం వెబ్ సిరీస్ లని రూపొందించేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ఆ లిస్టులోకి అనిల్ రావిపూడి పేరు కూడా చేరిందని అంటున్నారు.
సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్ మీద వర్క్ చేసాడు. ఆయన తన సహరచయితలతో కలిసి ఈ స్క్రిప్టుని దాదాపుగా పూర్తి చేసాడు. అయితే ఆ సినిమా ఇప్పట్లో తెరకెక్కే అవకాశమే లేదు. వెంకటేష్, వరుణ్ తేజ్ వారి వారి సినిమాల్తో బిజీగా ఉన్నారు. అదీగాక ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుంది. దాంతో ఈ ఖాళీ సమయంలో ఆహా కోసం కామెడీ వెబ్ సిరీస్ ని రూపొందించాలని అనుకుంటున్నారట.
ఈ మేరకు అల్లు అరవింద్ తో చర్చలు జరిగాయని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. అయితే ఈ వెబ్ సిరీస్ ని తానే డైరెక్ట్ చేస్తాడా లేదా స్క్రిప్ట్ పార్ట్ వరకే చూసుకుంటాడా అన్నది అధికారిక సమాచారం వస్తేనే తెలుస్తుంది.