Advertisementt

పూరి ‘జనగణమన’ పూర్తిగా మార్చేశాడా?

Sat 27th Jun 2020 01:51 PM
janaganamana script,puri jagan,script,karan johar,bollywood hero,director  పూరి ‘జనగణమన’ పూర్తిగా మార్చేశాడా?
Puri Changed Janaganamana Script for Bollywood Hero పూరి ‘జనగణమన’ పూర్తిగా మార్చేశాడా?
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్, మహేష్ బాబుతో తెరకెక్కిద్దామనుకున్న జనగణమన మూవీని ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఓ బాలీవుడ్ హీరోతో తెరకెక్కించబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసాడు. జనగణమన స్క్రిప్ట్ ని పాన్ ఇండియా లెవల్ అని చెప్పిన పూరి హీరో ఎవరో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు. అయితే జనగణమన స్క్రిప్ట్ డెవలెప్ చెయ్యి సినిమా చేద్దామని చెప్పిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. ఎవరో ఒక బాలీవుడ్ స్టార్‌ని ఈ సినిమా కోసం ఒప్పిస్తాడు. అయితే ఇప్పుడు జనగణమన బ్యాగ్ డ్రాప్ మొత్తం దేశ భక్తితో కూడుకున్నదని.. మహేష్‌ని హీరోగా అనుకున్నప్పుడు ఈ కథ ఆర్మీ నేపథ్యంలో ఓ వీర జవాన్ మీద రాసుకున్నాడట పూరి. కానీ తాజాగా పూరి స్క్రిప్ట్‌ని మార్చేశాడట. కరణ్ జోహార్ సలహాతో జనగణమన స్క్రిప్ట్ చేంజ్ చేశాడనే టాక్ వినబడుతుంది.

అయితే తాజాగా పూరి కథలో మిల‌ట‌రీ సెట‌ప్పే లేద‌ని.... భార‌తీయుల‌కు త‌మ బాధ్య‌త గుర్తు తెచ్చే సినిమాగా ఈ జనగణమన ఉండబోతుంది అని.. దేశాన్ని ప‌ట్టిపీడుస్తున్న అనేక స‌మ‌స్య‌లు మాత్రమే కాకుండా వాటికి ప‌రిష్కారాలూ తెర‌పై చూపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఓ ర‌కంగా ఇది శంక‌ర్ భారతీయుడు, మురుగదాస్ తుపాకీ సినిమాలకు కాస్త అటు ఇటుగా దగ్గరగా ఉన్న కథగా చెబుతున్నారు. జనగణమనలో దేశభక్తిని టచ్ చేస్తూనే.. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని కూడా పూరి కథలో కలిపేసాడట. మరి ఈ జనగణమన సినిమాని పూరి అనౌన్స్ చేసినప్పటి నుండి... సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. 

Puri Changed Janaganamana Script for Bollywood Hero:

Janaganamana Script Changed for Karan Johar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ