Advertisementt

4 ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ‘చ‌క్ర’ ట్రైలర్!

Fri 26th Jun 2020 07:41 AM
chakra,trailer,4 south indian languages,hero vishal,chakra trailer release  4 ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ‘చ‌క్ర’ ట్రైలర్!
Chakra Trailer Release Date Out 4 ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ‘చ‌క్ర’ ట్రైలర్!
Advertisement
Ads by CJ

నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ‘చ‌క్ర’ ట్రైలర్ ని విడుద‌ల చేయ‌డం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది: యాక్ష‌న్‌ హీరో విశాల్

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్. ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చ‌క్ర‌’. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ ‘చ‌క్ర’‌ తెలుగు వెర్ష‌న్‌ పోస్ట‌ర్, ‘చ‌క్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఒకేసారి తెలుగు, తమిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో జూన్27(శ‌నివారం)విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు తెలిపింది చిత్ర‌యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత విశాల్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవ‌ల విడుద‌ల చేసిన ‘చ‌క్ర’ పోస్ట‌ర్‌కి, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ శ‌నివారం ఒకేసారి నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో ట్రైల‌ర్స్‌ని విడుద‌ల చేయ‌డం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అన్నారు.

విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ ‘అభిమ‌న్యుడు’ త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Chakra Trailer Release Date Out:

Excited To Release ‘Chakra’ Trailer Simultaneously In 4 South Indian Languages - Action Hero Vishal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ