ప్రస్తుతం కరోనా వలన ఒక్క సినిమా రంగమే కాదు.. మిగతా రంగాలన్నీ కుదేలయ్యాయి. ఏ రంగంలో అయినా.. పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు ఇచ్చి.. షూటింగ్స్ ప్రారంభించినా.. కరోనా దడ ఎవ్వరిలోనూ తగ్గడం లేదు. అందుకే సీరియల్స్ షూటింగ్స్‌కి ప్యాకప్ చెప్పేసారు. మరోపక్క సినిమా ట్రయిల్ షూట్స్ కూడా ఆగిపోయేట్లుగా ఉంది. అందుకే సినిమాల బడ్జెట్ కంట్రోల్.. హీరోలు, నటులు పారితోషకాల కటింగ్స్ అంటూ దర్శకనిర్మాతలు చర్చలు మొదలెట్టారు. అయితే హీరోలెవరూ పారితోషకాల విషయంలో మాట్లాడడం లేదు కానీ.. మహేష్ తో సర్కారు వారి పాట దర్శకుడు పారితోషకం తగ్గించుకున్నట్లుగా, ఆ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పారితోషకం తగ్గించుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
ఇక సినిమాల సంగతి అలా ఉంటే.. ఇప్పుడు బుల్లితెర నటులు పారితోషకాల కటింగ్స్ తో పాటుగా... హాట్ హాట్ గా స్టేజ్ ల మీద యాంకరింగ్ చేసే యాంకర్స్ పారితోషకాల కటింగ్స్ కూడా ఉండబోతున్నాయట. జబర్దస్ యాంకర్స్ అనసూయ, రష్మీ, యాంకర్ సుమ ఇలా టాప్ లో ఉన్న యాంకర్స్ పారితోషకాల కటింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయని.. ఇప్పటి వరకు తీసుకునే దానికంటే సగం మాత్రమే పారితోషకాలు ఇస్తామని... కరోనా తగ్గి మాములు పరిస్థితులు నెలకొన్న తర్వాత వీరికి యదావిధిగా పారితోషకాలు ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. కుదరదని చెప్పే వాళ్ళని ఇంటికి పంపేస్తున్నారట. మరి సినిమానే కాదు.. బుల్లితెర పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరమే అంటున్నారు. హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు.... పారితోషకాల కటింగ్స్ హాట్ యాంకర్స్ ని తాకింది అని.. ఇక నుండి యాంకర్స్ డిమాండ్ చేసే స్థితి ఉండదని కూడా అంటున్నారు.