Advertisementt

బిగ్ బాస్ 4లోకి బిత్తిరి సత్తి..?

Wed 24th Jun 2020 01:27 PM
bigg boss 4,telugu television,biggboss,bithiri satti,  బిగ్ బాస్ 4లోకి బిత్తిరి సత్తి..?
Bittiri satti will come in Bigg boos 4..? బిగ్ బాస్ 4లోకి బిత్తిరి సత్తి..?
Advertisement
Ads by CJ

టెలివిజన్ తెరపై తెలంగాణ మాండలికంలో వార్తలని ప్రజలకి చేరవేసి విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న చేవెళ్ల రవి, బిత్తిరిసత్తిగా అందరికీ సుపరిచితుడే. స్క్రీన్ నేమ్ బిత్తిరిసత్తి పేరుతో పాపులర్ అయిన ఈ న్యూస్ యాంకర్ బిగ్ బాస్ సీజన్ 4లోకి వెళ్లనున్నాడని ప్రచారం జరుగుతోంది. తాను ప్రస్తుతం పనిచేస్తున్న టీవి ఛానెల్ కి రాజీనామా చేసాడని వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రముఖ ఛానెల్ లో పనిచేసి, ఆ తర్వాత మళ్లీ వేరే ఛానెల్ లోకి వెళ్ళిన బిత్తిరి సత్తి అక్కడి నుండి కూడా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షో బిగ్ బాస్ లోకి వెళ్లనున్నాడని అంటున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో, నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్ల వేటలో ఉందని సమాచారం అందుతోంది. అయితే బిత్తిరి సత్తి బిగ్ బాస్ యాజమాన్యాన్ని సంప్రదించాడని అంటున్నారు. 

తెలుగు టెలివిజన్ పై మంచి క్రేజ్ ఉన్న బిత్తిరి సత్తిని కంటెస్టెంట్ గా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉందట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Bittiri satti will come in Bigg boos 4..?:

Bittiri satti will come in Bigg boos 4..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ