పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలని కూడా లైన్లో పెట్టాడు. అందులో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విరూపాక్ష సినిమా కూడా ఒకటి. విరూపాక్ష అనే టైటిల్ ని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా కొనసాగుతుంది. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్నాడట.
వకీల్ సాబ్ తో పాటు చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ ని ఆపివేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాకి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడని ఇంతకుముందే చెప్పారు. పవన్ కళ్యాణ్, కీరవాణి కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం ఇదే. అయితే ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయట.
ఈ పాటికే కీరవాణి వాటికి సంబంధించిన ట్యూన్లు ఇచ్చాడని అంటున్నారు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్న ఈ సినిమా షూటింగ్ వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాతే మొదలు కానుందట.