Advertisementt

క్రిష్ణా అండ్ హిజ్ లీల..క్రిష్ణాస్ బేబ్.. రుక్సార్

Wed 24th Jun 2020 11:08 AM
krishna and his leela,seerat kapoor,siddhu jonnalagadda,ravikanth perepu  క్రిష్ణా అండ్ హిజ్ లీల..క్రిష్ణాస్ బేబ్.. రుక్సార్
Krishna and his leela.. Krishnas babe Ruksaar క్రిష్ణా అండ్ హిజ్ లీల..క్రిష్ణాస్ బేబ్.. రుక్సార్
Advertisement
Ads by CJ

ఓటీటీలో విడుదల కాబోతున్న చిత్రాల లిస్టులోకి వచ్చేసిన సిద్ధు జొన్నల గడ్డ హీరోగా నటించిన చిత్రం క్రిష్ణా అండ్ హిజ్ లీల నుండి మూడవ హీరోయిన్ ని పరిచయం చేసారు. మొదటి ఇద్దరిలో ఒకరు సత్య, రాధా పాత్రలుగా పరిచయం అయితే మూడవ పాత్ర రుక్సార్ గా దర్శనమిచ్చింది. రన్ రాజా రన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్ రుక్సార్ పాత్రలో కనిపించింది. క్షణం దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రుక్సార్ పరిచయం చేసిన వీడియోలో సీరత్ కపూర్ గ్లామరస్ గా కనిపించింది. చిన్న పాటి గ్లింప్స్ వీడియోలో తనతో ప్రేమలో పడొద్దంటూ క్రిష్ణని హెచ్చరించింది. ఈ ముగ్గురి భామలతో ప్రేమాయణం నడిపించిన క్రిష్ణా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడనేది ఆసక్తిగా మారనుంది. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏ స్ట్రీమింగ్ వెబ్ సైట్లోకి రానుందో క్లారిటీ ఇవ్వలేదు. 

 ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన సినిమాలకి సరైన స్పందని లభించని నేపథ్యంలో ఈ సినిమా అయినా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుందేమో చూడాలి. 

click here for video

Krishna and his leela.. Krishnas babe Ruksaar:

Krishna and his leela.. Krishnas babe Ruksaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ