మాములుగా అయితే ఈపాటికే తెలుగులో మూడేళ్ళుగా బిగ్ బాస్ సీజన్ హడావిడి కనబడేది. బుల్లితెర మీద బిగ్ బాస్ హడావిడి జూన్ నుండే మొదలై జులై నాటికీ అది బుల్లితెర మీద ప్రత్యక్షం అయ్యేది. సాధారణ, పేరున్న సెలెబ్రిటీస్ తో పాటుగా పేరున్న హీరో వ్యాఖ్యాతగా రోజు నైట్ స్టార్ మా లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ కి బుల్లితెరపై ఆదరణ మాములుగా లేదు. ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యాఖ్యాతలుగా గత మూడు సీజన్స్ బాగా పాపులర్ అవడంతో నాలుగో సీజన్ పై అంచనాలు వచ్చేసాయి. అన్నట్టుగానే గత నెల మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి కూడా. వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నారు.. వీళ్ళు వెళుతున్నారూ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు హల్చల్ చెయ్యడం సీజన్ 4 కి నాగార్జునే మరోసారి వ్యాఖ్యాతగా స్టార్ మా డిసైడ్ చెయ్యడం జరిగింది అన్నారు.
అయితే తాజా పరిస్థితి చూస్తే బిగ్ బాస్ ఇప్పుడిప్పుడే బుల్లితెర మీదకొచ్చేలా లేదు. కారణం కరోనా. నిన్నగాక మొన్న మొదలైన టివి సీరియల్స్ కూడా ఇప్పుడు కరోనా కారణంగా మళ్లీ ఆగిపోయాయి. మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అలాంటిది బిగ్ బాస్ హౌస్‌లో ఒకే చోట 14 నుండి 17 మంది ఉండి.. రాత్రింబవళ్ళు గడపడం అనేది కుదిరేపనేనా.. కరోనా మహమ్మారి హైద్రాబాద్లో విజృంభిస్తుంది. దాని కారణంగా అన్ని రెడీ చేసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం కూడా వెనక్కి తగ్గాల్సిందే అంటున్నారు. లేదంటే బిగ్ బాస్ కోసం ఎంపిక చేసిన సెలబ్రిటీస్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో వచ్చేందుకు ఆసక్తి చూపరు. మరి ఈ ఏడాది బిగ్ బాస్ ఆగస్ట్ చివరి వారం నుండి మొదలవ్వొచ్చనే ప్రచారం షురూ అయ్యింది.