Advertisementt

‘జబర్దస్త్’ న్యూ ప్రోమోస్ వదిలారండోయ్!

Wed 24th Jun 2020 09:38 AM
jabardasth,new promos,ready,roja,mano,anasuya,rashmi,comedians  ‘జబర్దస్త్’ న్యూ ప్రోమోస్ వదిలారండోయ్!
After Lock down Jabardasth New Shows Ready ‘జబర్దస్త్’ న్యూ ప్రోమోస్ వదిలారండోయ్!
Advertisement
Ads by CJ

ప్రభుత్వం కరోనా లాక్ డౌన్ ముగియడంతో.. షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చిందో లేదో... బుల్లితెర నటులు సెట్స్ లో వాలిపోయారు. సీరియల్స్, షోస్ అంటూ యాంకర్స్, ఆర్టిస్ట్ లు అబ్బో అన్ని స్టూడియోస్ కళకళలాడుతున్నాయి. ఎనిమిదేళ్ళుగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్న జబర్దస్త్ కూడా కరోనా లాక్ డౌన్ తర్వాత కొత్తగా సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అనసూయ యాంకర్ గా రోజా, మను జడ్జెస్ గా కొత్త ఎపిసోడ్ షూట్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో జరగగా ప్రస్తుతం జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ షో జడ్జ్ రోజా మాట్లాడుతూ జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది కామెడీ ఫ్యాన్. బుల్లితెర ప్రేక్షకులంతా హ్యాపీగా ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేస్తూ.. 10 నిమిషాల ముందే జబర్దస్త్ కోసం టీవీ ముందు కూర్చుంటారు. కరోనా వల్ల జబర్దస్త్‌ను మీరు మిస్ అయ్యారు, నేను బాగా మిస్ అయ్యాను అని అంటుంది.

ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో కామెడీ స్క్రిప్ట్ రైటర్స్ తమ టాలెంట్ అంతా ఉపయోగించి.. మంచి కామెడీ సిద్ధం చేసుకున్నారు. అందుకే లేటెస్ట్ ప్రోమోస్ లో జబర్దస్త్ కామెడీ స్కిట్స్ అద్భుతంగా పేలుతున్నాయి. మూడు నెలలుగా జబర్దస్త్ లేక ప్రేక్షకులు చప్పగా బోర్ ఫీలవుతున్నారు... ఇంత కష్టమైన పరిస్థితులను కూడా కామెడీగా మలిచి వినోదం పంచడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు యాంకర్స్ అనసూయ, రష్మిలు. ఇక ఫన్, కామెడీతో పాటుగా అనసూయ గ్లామర్, రష్మీ అందాలు చూడడానికి కూడా రెడీ కమ్మంటున్నారు హాట్ యాంకర్స్. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కొత్త టీమ్స్‌ వస్తున్నాయి. కామెడీ మళ్లీ ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటుంది మల్లెమాల టీం.

After Lock down Jabardasth New Shows Ready:

Jabardasth New promos released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ