అసలే భారీ బడ్జెట్ సినిమా అందులోను పాన్ ఇండియా సినిమా. అలాంటి సినిమాకి ఎంత ప్లానింగ్ ఉండాలి. ఉంది కానీ.. కరోనా మొత్తం ప్లాన్స్ అన్ని చెడగొట్టింది. వేసుకున్న బడ్జెట్, అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి అయినా ఇప్పుడు ఆ సినిమా హీరోలే దర్శకుడిని టెన్షన్ పెడుతున్నారట. ఆ సినిమా ఏదో కాదు... పాన్ ఇండియా మూవీ RRR. రాజమౌళి దర్శకత్వంలో మొదలైన RRR మూవీ షూటింగ్ స్టార్టింగ్ లోనే హీరోలకు గాయాలై షూటింగ్ మందకొడిగా సాగింది. తర్వాత రామ్ చరణ్ వలన లేట్ అయ్యింది. ఇక ఎలాగోలా బండి పట్టాలెక్కి... ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంది అనుకుంటే కరోనా అడ్డం పడింది. కరోనాని కూడా పక్కనబెట్టి సినిమా షూటింగ్ కి రాజమౌళి సమాయత్తమవుతున్నాడు.
రెండు రోజుల ట్రయిల్ షూట్ తర్వాత RRR మళ్ళీ పట్టాలెక్కుతోంది అనుకుంటే.. హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పుడు రాజమౌళికి చుక్కలు చూపెడుతున్నారట. ట్రయిల్ షూట్ అని డూప్స్‌తో మ్యానేజ్ చేద్దామని డిసైడ్ అయితే అందుకు అనుమతిరాలేదంటున్నారు. ఇక రాజమౌళి ఒరిజినల్‌గానే వెళదామని చూస్తుంటే... అటు ఎన్టీఆర్ కానీ, ఇటు చరణ్ కానీ RRR షూటింగ్ కి అప్పుడే హాజరవమని, కరోనా మొత్తం సర్దుమణిగాకే షూటింగ్ అంటూ రాజమౌళిని ఇరుకున పడేసారు. బడ్జెట్ సంగతి పక్కన పెడదాం. కావాలంటే పారితోషకాలు తగ్గించుకుని నిర్మాతకు ఫేవర్ చేస్తామని చెబుతున్నారట. మరి రాజమౌళి మాత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్ సెట్స్ కి వచ్చిన ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకుంటే.. ఇప్పుడు హీరోల వలన రాజమౌళి సఫర్ అవుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.