సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వలన బాలీవుడ్ వారసులుగా టాప్ పొజిషన్ లో ఉన్నవారు, బాలీవుడ్ పెద్దలుగా చలామణి అయ్యేవారు.. వారసుల పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతనెత్తుకున్నవారు.. సోషల్ మీడియాకి విలన్స్ అయ్యి కూర్చున్నారు. సుశాంత్ అభిమానులే కాదు.. మాములు సినిమా ప్రియులు కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి బాలీవుడ్ మాఫియా అంటూ ఓ ఉద్యమానికి తెరలేపారు. కరణ్ జోహార్ ని, అలియా భట్ ని, సల్మాన్ ఒక్కరమేమిటి.. చాలామంది ప్రముఖులను సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు. అందులో కరణ్ జోహార్ సోషల్ మీడియాలో బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా కరణ్ జోహార్ ని ఊరుకునేలా లేరు. అందుకే కరణ్ జోహార్ ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు సుశాంత్ మరణం వలన జాన్వీకపూర్ ని ఎవ్వరూ ఏమి అనడం లేదు కానీ.. జాన్వీ కపూర్ నటించిన సినిమాకి పెద్ద చిక్కొచ్చి పడింది. జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనాని ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ లో విడుదల చేసే అవకాశం లేక.. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసారు. అయితే థియేటర్స్ లో రిలీజ్ చేస్తే ప్రెస్ మీట్స్ అంటూ సినిమాని ప్రమోట్ చేయాల్సివచ్చేది. అయినా ఓటిటి ద్వారా విడుదల చేసినా సోషల్ మీడియాలో ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రమోట్ చేయాలి. ఆ సినిమా నిర్మాత కరణ్ జోహార్ పూనుకుని ఆ గుంజన్ సక్సేనాని ప్రమోట్ చెయ్యాల్సి ఉంది. జాన్వీకపూర్ తో కలిసి కరణ్ ప్రమోషన్స్ ఉంటే.. సినిమాకి హైప్ వచ్చేది.అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య వలన కరణ్ ఇప్పట్లో బయటికొచ్చే పరిస్థితి లేదు. అందుకే అన్నది. మూలిగే నక్క మీద తాటిటెంక పడడం అని. అసలే గుంజన్ సక్సేనా థియేటర్స్‌లో విడుదల కాక బాధపడుతుంటే.. ఇప్పుడు ఓటిటిలో కూడా హైప్ రాకపోవడంతో జాన్వీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట.