బాలక్రిష్ణ 60వ పుట్టినరోజుని పురస్కరించుకుని బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుండి చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం అభిమానులకి మంచి గిఫ్ట్ ని అందించింది. నిమిషం పాటు ఉన్న టీజర్ లో బాలయ్య లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పంచెకట్టులో బాలయ్య డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. రూలర్ సినిమాలో బాలయ్య లుక్ బాలేదన్న వారందరూ ఈ సినిమాలో బాలయ్య లుక్ చూసి ఆహా అంటున్నారు.
అయితే తమ అభిమాన హీరో సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన తమ క్రియేటివిటీతో దానికి మరిన్ని హంగులు జోడించి సోషల్ మీడియాలో వదిలే అభిమానులు, బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరక్క్కుతున్న బీబీ3 చిత్ర టీజర్ ని యానిమేషన్ రూపంలో తీసుకువచ్చారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ లాగా ఫ్యాన్ మేడ్ టీజర్ అన్నమాట. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రమైన బీబీ3 బాలయ్యకి సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నారు. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.