Advertisementt

ఆహాలో భానుమతీ రామక్రిష్ణ.. రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Tue 23rd Jun 2020 05:16 PM
bhanumathi ramakrishna,aha,naveen chandra,saloni luthra,srikanth nagoti  ఆహాలో భానుమతీ రామక్రిష్ణ.. రిలీజ్ డేట్ వచ్చేసింది..!
Bhanumati release date fix... ఆహాలో భానుమతీ రామక్రిష్ణ.. రిలీజ్ డేట్ వచ్చేసింది..!
Advertisement
Ads by CJ

అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతో అంతగా గుర్తింపు తెచ్చుకోకపోయినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మెప్పించాడు. అయితే ప్రస్తుతం భానుమతీ రామక్రిష్ణ అనే సినిమాతో  మరోసారి హీరోగా కనిపించబోతున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీకాంత్ నగోతి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు.

కరోనా కారణంగా సినిమా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో భానుమతీ రామక్రిష్ణ ఓటీటీ ద్వారా రిలీజ్ అవనుంది. అల్లు అరవింద్ ఆహా యాప్ లో ఈ సినిమా జులై 13వ తేదీ నుండి అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. 30 ఏళ్లకి పైబడ్డ ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య పుట్టే ప్రేమని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సలోని లుత్రా సిటీ అమ్మాయిగా కనిపించనుండగా, నవీన్ చంద్ర ఏ లక్ష్యం లేని మామూలు స్మాల్ టౌన్ అబ్బాయిలా కనిపించనున్నాడు.

వీరిద్దరూ కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తే, వారి వారి ఇగోల కారణంగా వారి ప్రేమను ఎలా బయటపెట్టుకున్నారనేది కథాంశంగా ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. మరి జులై 13వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనున్న ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Bhanumati release date fix...:

Bhanumati release date fix...

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ