సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ చిత్రం సర్కారు వారి పాట అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి సర్కారు వారి పాట గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాటిలో భాగంగా ఈ సినిమాలో మహేష్ కి ప్రతినాయకుడిగా ఎవరు కనిపించబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ముందుగా కన్నడ హీరోలైన కిచ్చా సుదీప్, ఉపేంద్ర పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా మరో కొత్త పేరు బయటకి వచ్చింది. తమిళ నటుడైన అరవింద్ స్వామి సర్కారు వారి పాటలో విలన్ గా కనిపించనున్నాడని సమాచారం అందుతుంది. మాస్ అంశాలతో పాటు స్టైలిష్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి బాగ సూటవుతాడని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో అరవింద్ స్వామిని అడగనున్నారని అంటున్నారు.
మరి మహేష్ బాబుకి విలన్ గా అరవింద్ స్వామి ఒప్పుకుంటాడా లేదా చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ ఎమ్ బీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.