Advertisementt

క్రిష్ణ అండ్ హిస్ లీల.. మొదటి ప్రేమ అదిరిపోయింది..

Mon 22nd Jun 2020 01:06 PM
krishna and his leela,siddhu jonnalagadda,raviranth perepu,kshanam,rana daggubati  క్రిష్ణ అండ్ హిస్ లీల.. మొదటి ప్రేమ అదిరిపోయింది..
Krishna and his leela first love.. క్రిష్ణ అండ్ హిస్ లీల.. మొదటి ప్రేమ అదిరిపోయింది..
Advertisement
Ads by CJ

రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రం నుండి చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేసారు. గుంటూర్ టాకీస్ సినిమాలో హీరోగా చేసిన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడవి శేష్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ని తెరకెక్కించిన రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకుక్కిన ఈ చిత్రం ఓటీటీ వేదిక ద్వారా విడుదల అవనుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో భాగంగా ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో క్రిష్ణ తన ఫస్ట్ లవ్ సత్యని పరిచయం చేసాడు. సత్యగా జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. నిమిషం పాటు ఉన్న ఈ వీడియో చాలా రొమాంటిక్ గా ఉండడమే కాదు ఎంటర్ టైనింగ్ గానూ ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ చాలా గ్లామరస్ గా కనిపించింది. అయితే ఈ సినిమాలో శ్రద్ధాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు.

మొదటి లవ్ గా సత్య కాగా మిగిలిన ఇద్దరు కూడా పరిచయం కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయినప్పటికీ ఏ స్ట్రీమింగ్ సైట్ ద్వారా రిలీజ్ అవుతుందనేది వెల్లడి చేయలేదు. క్షణం సినిమాతో సస్పెన్స్ ని బాగా హ్యాండిల్ చేసిన రవికాంత్ క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమాతో రొమాంటిక్ చిత్రాలని కూడా బాగా డీల్ చేయగలడని నిరూపించుకుంటాడేమో చూడాలి.

click here for video

Krishna and his leela first love..:

Krishna and his leela first love..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ