Advertisementt

విశాల్ ‘చ‌క్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ వదిలారు

Tue 23rd Jun 2020 06:12 PM
vishal,chakra first look,chakra glimpse of trailer,chakra movie  విశాల్ ‘చ‌క్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ వదిలారు
Glimpse of Trailer of Vishal Chakra Movie Released విశాల్ ‘చ‌క్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ వదిలారు
Advertisement
Ads by CJ

యాక్ష‌న్‌ హీరో విశాల్ ‘చ‌క్ర’ ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చ‌క్ర‌’. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. కాగా కాసేప‌టి క్రితం ‘చ‌క్ర’‌ తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌‌ల చేశారు యాక్ష‌న్ హీరో విశాల్. ప‌వ‌ర్‌ఫుల్ ‌లుక్‌లో ఉన్న ఈ పోస్ట‌ర్ కి మంచి  రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా జూన్ 22 సాయంత్రం 5 గంట‌ల‌కు ‘చ‌క్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ పేరుతో వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

 

విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ ‘అభిమ‌న్యుడు’ త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ వీడియోలో విశాల్ ప‌వ‌ర్‌ఫుల్ మాస్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Click Here for చక్ర గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ 

Glimpse of Trailer of Vishal Chakra Movie Released:

Vishal Chakra first Look and Glimpse of Trailer Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ