Advertisementt

‘సూపర్ మచ్చి’ షూటింగ్ మొదలెట్టారు!

Tue 23rd Jun 2020 01:57 PM
super machi,last schedule,kalyaan dhev,ramanaidu studios  ‘సూపర్ మచ్చి’ షూటింగ్ మొదలెట్టారు!
Super Machi Last Schedule Begins ‘సూపర్ మచ్చి’ షూటింగ్ మొదలెట్టారు!
Advertisement
Ads by CJ

రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభ‌మైన కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ చివ‌రి షెడ్యూల్‌

కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభ‌మైంది. హీరో హీరోయిన్లు క‌ల్యాణ్‌దేవ్‌, ర‌చితా రామ్‌తో పాటు ఒక కీల‌క పాత్ర చేస్తున్న అజ‌య్‌పై కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి, అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటూ షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్త‌వుతుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని చిత్ర బృందం తెలిపింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి.

నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘తొలి సినిమా ‘విజేత’ తోనే నటనతో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’లో మరింత చక్కటి పర్ఫార్మెన్సుతో అలరిస్తారు. అటు మాస్ ఆడియెన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియెన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్సవుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఇప్పటికి తీసిన పాటలు చాలా అందంగా వచ్చాయి. ‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆడియో బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ అందించే కామెడీ అమితంగా అలరిస్తుంది. హీరోకి సపోర్టింగ్ గా నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. అలాగే రాజేంద్రప్రసాద్, హీరో కాంబినేషన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌’’ అని చెప్పారు.

తారాగణం:

కల్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ తదితరులు.

సాంకేతిక బృందం:

మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు

ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

ఆర్ట్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల

నిర్మాతలు: రిజ్వాన్, ఖుషి

దర్శకుడు: పులి వాసు

Super Machi Last Schedule Begins:

Kalyaan Dhev Super Machi Last Schedule Begins Today In Ramanaidu Studios

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ