Advertisementt

కేసీఆర్ మేధావి, పవన్ యోధుడు, ఎన్టీఆర్ అద్భుతం!

Mon 22nd Jun 2020 01:01 PM
nikhil siddharth,chit chat,pawan kalyan,jr ntr,kcr,nikhil,fans  కేసీఆర్ మేధావి, పవన్ యోధుడు, ఎన్టీఆర్ అద్భుతం!
Hero Nikhil Siddharth Chit Chat with Fans కేసీఆర్ మేధావి, పవన్ యోధుడు, ఎన్టీఆర్ అద్భుతం!
Advertisement
Ads by CJ

అర్జున్ సురవరం తర్వాత చందు మొండేటితో కార్తికేయ 2 సినిమా చేస్తున్న నిఖిల్ ఈమధ్యనే పెళ్లి కొడుకయ్యాడు. పెళ్లి తర్వాత భార్య తప్ప తన జీవితంలో పెద్దమార్పులేమి రాలేదంటున్నారు. లాక్ డౌన్ తో షూటింగ్స్ కి బ్రేకు పడడంతో కాస్త బోర్ ఫీలవుతున్నా అని చెప్పిన నిఖిల్ అభిమానులతో తాజాగా చిట్ చాట్ చేశాడు. అందులో తనకిష్టమైన నటుడు, పొలిటికల్ లీడర్, తనకి స్ఫూర్తి నిచ్చింది, తన బెస్ట్ ఫ్రెండ్ ఇలా చాల విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. వెన్నెల కిషోర్ గురించి చెప్పమనగానే కామెడీ బాగా చేస్తాడు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని చెబుతున్నాడు. ఇక అల్లు అర్జున్ మంచి నటుడు అని చెప్పిన నిఖిల్.. కేసీఆర్, ఎన్టీఆర్ గురుంచి అడగగానే..

కేసీఆర్ మోడరన్ మేధావి అని కితాబునిచ్చేసాడు. అలాగే ఎన్టీఆర్ అద్భుతమైన నైపుణ్యం ఉన్న నటుడు అని చెబుతున్నాడు. ఇక చందు మొండేటి తనకిష్టమైన ఫ్రెండ్ అని చెబుతున్నాడు నిఖిల్. ప్రభాస్ గురించి అని అడగగానే.. ప్రభాస్ భాయ్ బంగారం అన్న నిఖిల్.. తనకి స్ఫూర్తి మాత్రం చిరునే అంటున్నాడు. అర్జున్ సురవరం ఈవెంట్ లో చిరు తన గుంచి మాట్లాడిన మాటలు ఎప్పటికి మరిచిపోలేనని చెబుతున్నాడు నిఖిల్. అలాగే నిఖిల్ కి ఖుషి సినిమాలో భూమిక నటన అంటే చాలా ఇష్టమట. తాను అభిమానించే హీరోయిన్ కూడా భూమికే అంటున్నాడు. ఇక పవన్ కల్యాణ్ గురించి చెబుతూ.. ఆయన యోధుడు.. నేను ఎప్పటికీ ఆయనకు అభిమానినే.. అని తెలిపాడు.

Hero Nikhil Siddharth Chit Chat with Fans:

Nikhil Siddharth Chit Chat Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ