Advertisementt

బాలీవుడ్ బడా స్టార్స్ భయపడుతున్నారా?

Mon 22nd Jun 2020 12:40 PM
sushanth singh rajput,effect,sonakshi sinha,salman khan,bollywood stars  బాలీవుడ్ బడా స్టార్స్ భయపడుతున్నారా?
Fearing in Bollywood Stars with Sushanth Demise బాలీవుడ్ బడా స్టార్స్ భయపడుతున్నారా?
Advertisement
Ads by CJ

సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వలన చాలామంది సినిమా ప్రముఖులు నెటిజెన్స్ నుండి వ్యతిరేకత ఎదుర్కుంటున్నారు. ఏక్తాకపూర్, కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఇలా చాలామందిని బ్లేమ్ చేస్తున్నారు నెటిజెన్స్. కంగనా రనౌత్ వంటి వాళ్ళు బాలీవుడ్ వారసుల కారణంగానే సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకున్నాడని అంటుంటే... సుశాంత్ అభిమానుల్లో కొంతమంది సుశాంత్ ని గతంలో విమర్శించిన వాళ్ళ వీడియోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంటే.. సుశాంత్ మరణంతో సెలెబ్రిటీస్ ని అన్ ఫాలో చేస్తూ తమ వ్యతిరేకతను చాటుకుంటున్నారు. అలియా భట్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లాంటోళ్ళ అభిమానులు చాలామంది వాళ్ళకి అన్ ఫాలో చేస్తూ షాకిస్తున్నారు. అయితే ఇది చూసి భయపడినట్లుగా ఉంది కొంతమంది వ్యవహారం.

అందులో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాలు ప్రముఖంగా కనబడుతున్నారు. ఇంత నెగిటివిటీని తట్టుకోలేనంటూ సోనాక్షి సిన్హా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఏకంగా తన అభిమానులకు సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులకు అండగా నిలవమని.. వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దని తన అభిమానులకు హితవు పలికాడు. మరి వారసత్వం వలనే సినిమా పరిశ్రమలో బయటినుండి వచ్చినవాళ్లు నెగ్గుకురాలేకపోతున్నారని, వాళ్ళ నెపోటిజం వలనే యంగ్ హీరోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ సుశాంత్ సింగ్ మరణం దగ్గరనుండి చాలామంది నెటిజెన్స్ సోషల్ ఇండియాలో పెద్ద ఉద్యమమే నడిపిస్తున్నారు. దానితో తమ క్రేజ్ ఎక్కడ తగ్గుతుందో అని భావించిన సల్మాన్ లాంటోళ్ళు ఇలా స్వీట్ ట్వీట్స్ వేస్తున్నారు.

Fearing in Bollywood Stars with Sushanth Demise:

Sushanth Singh Rajput effect on Sonakshi Sinha and Salman Khan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ