ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక మందన్న టైం నడుస్తుంది. ఈ ఏడాది వరసగా రెండు పెద్ద హిట్స్ పడడంతో ఇప్పుడు హీరోలందరూ రష్మిక అయితే ఎలా ఉంటుంది అని ముచ్చటిస్తున్నారు. కానీ పాపకి హైట్ ప్రాబ్లెమ్. పవన్, ప్రభాస్ లాంటోళ్ళ పక్కన అమ్మడు అస్సలు సరిపోదు. అయితే అమ్మడుకి హైట్ లేకపోతేనేమి.. లక్ ఉంది. అందుకే వరస ఆఫర్స్ పడుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ఏకంగా పాన్ ఇండియా మూవీ పుష్ప లో నటించబోతుంది. ఈ సినిమాలో కొత్తగా డి గ్లామర్ పాత్రలో నటిస్తుంది. దాని తర్వాత మాతృక కన్నడలో పొగరు సినిమాలో ధృవ సర్జతో కలిసి నటిస్తుంది.
ఇక తాజాగా విజయ్ తో తమిళనాట కూడా అడుగుపెట్టబోతుందట. మాస్టర్ సినిమాలోనే స్టార్ హీరో విజయ్ సరసన నటించాల్సిన రష్మిక డేట్స్ కారణంగా ఆ సినిమా చెయ్యలేకపోయింది. కానీ విజయ్ తదుపరి చిత్రంలో రష్మికనే హీరోయిన్ అంటుంది కోలీవుడ్ మీడియా. మురుగదాస్ - విజయ్ కాంబోలో తెరకెక్కబోతున్న తుపాకీ సీక్వెల్ లో రష్మిక హీరోయిన్ గా ఖాయమంటున్నారు. తుపాకీ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయితే మళ్లీ సీక్వెల్ లోను కాజల్ నే కంటిన్యూ చేస్తున్నట్లుగా వార్తలొచ్చినా ఇప్పుడు కాజల్ ప్లేస్ లోకి కొత్తగా ఉంటుంది అని రష్మికాని ఎంపిక చేసినట్లుగా కోలీవుడ్ మీడియా కథనం.